Tuesday 14 March 2017

నేను అనుకున్న రోజు వచ్చేసిందోచ్... మీరనుకునేది కాదు లే...

మొత్తానికి ఉద్యోగం కులం లాంటి అడ్డగోడల్ని తీసేస్తాయనుకున్న నేను చాలా ఆనందంగా ఫీలవుతున్న రోజిది. మొత్తానికి ఉద్యోగం సాధించిన.. ఇక మిగిలిందొక్కటే. తనకి చెప్పేసి తన రిప్లై తెల్సుకునుడు.ఆ రోజు మా మధ్య జరిగిన సంభాషణ
నేను-- హలో...(చాలా రోజుల తర్వాత కదా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో)
తను-- హలో... జాబొచ్చిందా ఏంటి చాలా నెలల తర్వాత ఫోన్ చేశినవ్( ఎవరైనా చెప్పారా.. లేక జాబోస్తే తప్ప ఫోన్ చెయ్యడని ఫిక్సైందా)
నేను-- ఆ అవును... నీకెలా తెలుసు.. ఎవరన్నా చెప్పిండ్రా..
మిసిమి-- లేదు ఎందుకో అనిపించిందంతే...(నాకన్ని ఆలా తెలిసిపోయాంతే సీతమ్మ వాకిట్లో... అంజలి టైపులో)
మళ్లీ తనే--- మొత్తానికి అనుకున్నది  సాధించావ్.. కంగ్రాట్స్ (నిన్ను సాధించనిదే ఈ లోకంలో ఎంతటి విజయమైనా లెక్కలేదు)
నేను-- నీతో మాట్లాడాలి. ఈ బుధవారం కలిసే అవకాశముందా
తను-- సరే కలుస్తా...
ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్న నాకు... ఏం జరిగిందో తర్వాతి పోస్టులో

Friday 30 December 2016

నా sixth senseను నమ్ముతున్నాను...ఇదే తనకి ఆఖరి Message...

ఏం చెప్పాలి అనుకుని ఈ మెసేజ్ స్టార్ట్ చేశానో తెల్వదు... అసలు నేనే అంతexpressive కాదు... నువ్విక చెప్పే chance ఎప్పుడూ ఇవ్వలేదు. ఎన్నోసార్లు కలుద్దామని అడిగా reply లేదు.. కనీసం 4years back proposalకే సమాధానం లేదు. అవునో కాదో చెప్పటానికి ఇన్నేళ్లు పడ్తుందా. నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. Caste, job, కుటుంబం. కానీ 1year కింద నేననుకున్నది వేరు. ఒక మంచి job ఉంటే నీతోని.. మీ familyతోని పెళ్లి గురించి మాట్లాడుదామన్న ఆలోచన ఉండే.. కేవలం  పెళ్లి proposal చేస్తే ఎవరూ ఒప్పుకోరని తెలిసే బయటకు వచ్చి సదువుతున్న...  కానీ ఏం చేద్దాం.. కుదర్లేదు. ఎప్పటికి కుదురుతుందో తెలియదు. వయసేమో పెరుగుతోంది. job ఇప్పటికిప్పుడు వస్తుందన్న ఆశేమో తగ్గుతుంది. నిన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నీతో గట్టిగా మాట్లాడటానికే ఆలోచించే పరిస్థితి నాది. చాలా మంది అమ్మాయిలతో పోలిస్తే నువ్వేbetter. కనీసం proposalకి సమాధానం చెప్పకుండా గడిపేస్తున్నవ్..  నా sixth sense చెప్తోంది. ఇవన్ని workout కావని దాని మీట వినక తప్పదు. అలా అని నీమీద కోపం పెంచుకునే మనస్తత్వం నాది కాదు. నేను ఎప్పుడో చెప్పా.. ఓ 50 ఏళ్లకో 60 ఏళ్లకో జీవితం ముగిసే టైమ్ లో "అప్పట్లో ఆ అమ్మాయికి చెప్పితే ఒప్పుకునేదేమో"అని నేను...”ఆ అబ్బాయి దైర్యం చేసుంటే జీవితం వేరేలా ఉండేదని"  నువ్వు....  "అనవసరంగా జీవితం మిస్ అయిపోయామే" అని ఇద్దరం బాధపడకుండా ఉండటానికే 4 ఏళ్లక్రితమైనా.... ఇప్పుడైనా నీకు వివరంగా చెప్పేది. అంతే తప్పా కచ్చితంగా నువ్వు ఒప్పుకోవాలని కాదు. నిన్ను ఒప్పించటానికి అంతకన్నా కాదు. అసలు ఓ వ్యక్తిని బలవంతంగా ఇష్టపడటమో.. పరిస్థితులకు తగ్గి ప్రేమించటమో... ఆస్తులు చూసి పెళ్లి చేసుకోవటమో చేస్తే అలాంటి జీవితాలు ఎలా ఉంటాయో నీ చుట్టు పక్కల ఉన్న వాళ్లను గమనిస్తే తెలుస్తుంది.


Monday 19 December 2016

హమ్మయ్యా... హార్ట్ బీట్ పెరిగినా.. హార్ట్ లో ఉన్నది చెప్పిన....

2012 డిసెంబర్ 19... నేనెప్పటికి మర్చిపోలేని రోజు... చిన్నప్పటిసంది అమ్మాయిలతోని మాట్లాడాలంటేనే భయపడే బ్యాచ్ లో ముందుండే నేను 8నెలల ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడైపోయా.. ఒకమ్మాయికి "నువ్వంటే ఇష్టమని" చెప్పటానికి  "నేనెంత కష్టపడ్డానో".
డిసెంబర్ 19 గడిస్తే తనని కలిసి... చూసి... మాట్లాడే అవకాశముండదు. ఇక అప్పటికి చెప్పకపోతే.. ఇక ఎప్పటికి చెప్పలేనని అర్థమైంది. ఎంతో ధైర్యంతో పొద్దున్నుంచే పంద్రాగస్ట్ ఉపన్యాస పోటీలకు Prepare అయినట్లు ఎం చెప్పాలి ఎలా చెప్పాలి... ఎంతసేపు చెప్పాలి... చెప్పిన తర్వాత ఎలా వెనక్కు రావాలి అన్నదానితో సహా అన్ని Prepare అయిన. సినిమాల Effect.. లేక తనిచ్చిన CADBURY ప్రభావమో... చాక్లెట్ ప్రపోజల్ కు ఫిక్సైన. ఫోన్ చేసి మాట్లాడాలి.. రోడ్డు చివర్లో ఉంటానని చెప్పిన పది నిమిషాలకు బయటకొచ్చింది. పది నిమిషాల్లో తను 20 అడుగులు వేస్తే....... నా గుండె నిమిషానికి 200 సార్లు కొట్టుకుంది. ఆ హడావుడిలో చివర్లో ఇవ్వాల్సిన చాక్లెట్ ముందే ఇచ్చిన... తను నా చేతిలో శ్రీ శ్రీ మరోచరిత్ర పెట్టి ALL THE BEST చెప్పింది( తనకి ముందే తెలుసా ఏందని నాకు డౌటొచ్చింది). మొత్తానికి చెప్పాల్సిందాంట్లో Quarter(FULLలో 1/4th) చెప్పిన తర్వాత నా గుండె వేగం 200 నుంచి 150కి తగ్గింది.  అసలు ఎమంటుందో... ఎప్పుడు చెప్తుందో.. తిడుతుందో...మరొక్కసారి గుండె మారథాన్ పోటీలకు వెళ్లినట్టనిపించింది. 

Sunday 9 October 2016

దీన్నెవరూ PROPOSAL అనరు... అనకూడదు...నేనే అనుకోవట్లే...

నేనెలా PROPOSE చేశానంటే... అసలు ఇలా కూడా PROPOSE  చేస్తరా అనిపించేలా...  ఇప్పుడే రాయలేను.. అదో పెద్ద కథ.. నా వ్యథ... 

8 నెలల ఆలోచనలు 3 గంటల REHEARSALS 8 నిమిషాల PROPOSAL STAY HERE FOR THAT POST..... Here it is ఇదీ నా ప్రపోసల్

Wednesday 5 October 2016

పొడుగు జడతో అందంగా పేర్చిన బతుకమ్మ ... మిసిమి

పొడవైన జడతో నా ముందే తిరుగుతున్న అందమైన బతుకమ్మ తను... 

రకరకాల పూలే తన వ్యక్తిత్వమైతే...

స్వచ్ఛంగా వినిపించే నవ్వులు తామరలు...

తన మాటలు ముద్ద బంతిపూలు....

కోపం ఎర్రటి కనకంబరాలు... 

రంగుల మేకప్ అవసరం లేని గునగపూల లాంటి మనస్తత్వం

ఎహే కవిత్వం మనకు సూటవదు లే...
ఇంతలా మిసిమి పొగుడుతున్నా... తనెప్పుడూ బతుకమ్మ ఆడింది లేదని చెప్పింది. అసలు వాళ్లింట్లో అలాంటి సంప్రదాయమే లేదంది. చా... నా కవిత అందుకే మధ్యలో ఆగిపోయింది.  బతుకమ్మనెత్తుకున్న మిసిమిని చూడటం సాధ్యమేనా...!!!

Tuesday 23 August 2016

4 నెలల పాటు భరించి... తర్వాత బరువై దించేశా


తనకి ఇష్టమైన ఓ పాటని నా MOBILE RINGTONE  గా పెట్టుకున్నా. ఆ తర్వాత రోజే యథాప్రకారమే ఏదో అనేయటం వల్ల తనతో గొడవైంది. ఇక ఆగుతుందా... 4 నెలల పాటు నాకు CALL రాలేదు. ఈ RINGTONE వినే అవకాశం తనకు రాలేదు. సరే మనం CALL చేస్తే LIFT చెయ్యదు. కనీసం వెనక్కిCALL చేస్తే ఆ RINGTONE ఐనా వింటుందని నా ఆశ. ఇలా గడిచిపోతుండగా  AIRTEL నా జేబు నుంచి నెలకు వంద రూపాయలు లాక్కుంటునే ఉంది. ఇక ఆ చార్జీల్ని భరించలేక తనకిష్టమైన పాట... నా MOBILE RINGTONE పీకనొక్కా... ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ మాటలు మొదలైనా... ఆ RINGTONE మాత్రం మళ్లి ఎవరికి వినిపించకుండా జాగ్రత్త పడుతున్నా... మీరు వినాలంటే కింద ఉంది ఆ పాట... మరో చరిత్ర(2010)


Sunday 21 August 2016

పొగడ్తలంటే నచ్చవని చెప్పానా.. నేను చెప్పానా... నీకు చెప్పానా....

మరీ నిన్ను ఎక్కువ పొగిడేస్తున్నానేమో అనిపిస్తోంది. చదివే వాళ్లకు.... రాసే నాకు అలాగే అనిపిస్తోంది. మరీ ఏం చేద్దాం.. ఓ పనిచేద్దాం. నీలో నచ్చని విషయాల్ని చెప్పనా... ప్రతి మనిషిలో అన్ని నచ్చే గుణాలే ఉండాలని కోరుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. అలాగే నీలోనూ కొన్ని ఉన్నాయి. కాకపోతే త్రివిక్రమ్ చెప్పినట్టు...


ఒక వ్యక్తిని ప్రేమిస్తే వాళ్ల తప్పుల్ని క్షమించగలగాలి....

లేదా వాళ్లని ప్రేమించట్లేదని ఒప్పుకోవాలి....

ఈ రోజుకి పప్పు... పెరుగు... సాంబార్... అంతే...


Saturday 20 August 2016

శ్వాస మీద ధ్యాస... ఎప్పటికి కుదరదు....

శ్వాస మీద ధ్యాస... ఈ పదాల్ని తను నెమ్మదిగా పలుకుతుంటే నా శ్వాస ఆగిపోయి... ధ్యాసంతా తన మీదే ఉండేది. ఎప్పుడైనా మంచిగనిపించట్లేదని చెప్పినా.... ఏవో సమస్యలున్నాయని చెప్పినా.. "శ్వాస మీద ధ్యాస" ఉంచాలనేది. శ్వాస మీద ధ్యాస ఏంటో నా బుర్రకి అర్థం కాకపోయినా TRY చేస్తుంటే మాత్రం అర్థమైంది... నా శ్వాసను నేను మర్చిపోయానని... ఇంకా రాయాలనే ఉంది... ప్చ్ ఏం చేస్తాం...శ్వాస మీద ధ్యాస పెట్టే టైమైంది... వెళ్తున్నా.... 



Sunday 14 August 2016

NOKIA PLACEలో BLACK BERRY వచ్చింది... వెళ్లిపోయింది...

నిద్రకు బానిసనైన  నేను.... అదే నిద్రలో నా NOKIA XPRESS MUSIC MOBILE పోగొట్టుకున్నా.  హైదరాబాద్ కు సరిగ్గా 274 కిలోమీటర్ల దూరంలో ఉన్న తనకు నాకు  నెల రోజుల పాటు కాల్స్ బంద్ అయినయ్.  ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చిన మిసిమి.... ఫ్రెండ్ ద్వారా ఈ విషయం తెల్సుకొని ఓ రోజు సాయంత్రం BLACK BERRY ఇచ్చింది. BUT CHARGER లేదు.. కొనుక్కోమంది. మన బద్ధకానికి సరిపోయినట్టుగా ఓ నాలుగు రోజుల దాకా ఆ ఫోన్  వైపే చూడలేదు. ఐదో రోజు రుసరుసలాడుతూ వచ్చి " నా BLACK BERRY ఇచ్చేయ్ వెంటనే అనేసింది" . నేనిప్పుడు వేరే పనిమీద వెళ్తున్నా తర్వాత ఇస్తానంటే... కుదరదని చిన్న పిల్ల చాక్లెట్ ఏదో గుంజుకున్నట్టు వెంటనే ఇచ్చేయ్యమంది.

 దేవుడా... నేనడిగానా... నువ్వే ఇచ్చి నువ్వే గుంజేసుకోవటం ఏందీ? "అవన్ని నాకవసరం లేదు వెంటనే ఫోన్ ఇచ్చేయ్ " తేల్చేసింది ఇక మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు..... తర్వాత ఎప్పుడో చెప్పింది. CHARGER కొనుక్కోమంటే వినకుండా అలాగే పెట్టేస్తే ఎలా అందుకని తీసేసుకున్నా అని... అప్పుడు అర్థం కాలేదు ఫోన్ ఎందుకిచ్చావో... ఇప్పుడే అర్థమైంది ఎందుకు తీసేసుకున్నావో.... 

Friday 12 August 2016

ఇలాంటివి ఎప్పుడూ అడగొద్దని అర్థమైంది!!

అమ్మాయిల్ని ఏదీ అడగొద్దు.. వాళ్లు చెప్తే వినాలంతే  సలహాలు ఇవ్వటానికి ప్రయత్నిస్తే... అంతే సంగతులు.
ఓసారి LIPSTICK ఎక్కువైందేమోనని రోజంతా గమనించి సాయంత్రం చెప్పిన అదే విషయాన్ని. అప్పుడు చూడాలి తన కోపం "LIP STICK కి LIP BALMకి తేడా తెల్వకుండా సలహాలు ఇవ్వొద్దని" గట్టిగనే చెప్పింది. ఓ రెండు రోజులు మాట్లాడలేదు కూడా.
హడావుడిలో జడ వేసుకోవటం మర్చిపోయి.... LUNCH TIMEలో జడ వేసుకోవటం బాలేదని చెప్పిన నాకు ఆమె చూసిన కొర కొర చూపులు ఎంత భయపెట్టినయ్ అంటే ఇంకోసారి ఆ విషయే ఎత్తలేదిక.
మిసిమిని నేను అడిగిన కొన్ని విషయాలు తను చెప్పిన సమాధానాలు....
 ---నీ జడ అంత పెద్దగా ఎప్పటి నుంచి ఉంది...
---ఆ జుట్టుకు ఏ HAIR OIL వాడుతావు....
---నెలకి ఎన్ని BOTTLES అయిపోతయ్....
---చిన్నప్పుడు రెండు జడలు వేసుకున్నవా??..
------అసలు POST GRADUATION కోసం అంత దూరం ఎందుకు పోయినవ్?...

వీటన్నింటికి తను సమాధానం చెప్పిందనుకుంటున్నారా. చెప్తే మిసిమి ఎందుకు అవుతుంది. మరో మామూలు అమ్మాయి అయ్యేది.


Wednesday 10 August 2016

రంగుల లోకంలో....SHE'S CRAZY...I AM LAZY

వారానికి ఏడు రోజులన్న విషయం ఎవర్ని అడిగిన చెప్తరు. ఆరు రోజులు గడిస్తే ఆదివారం వస్తుందని అనుకుంటరు. నాలాంటొళ్లు. కానీ గమనిస్తే తెలిసింది. సోమ వారం నుంచి శని వారం వరకు రోజుకో COLOR DRESS  వేసుకొస్తుందని. నిజంగా తను ఇలాంటి విషయాల్లో CRAZY నే తనే ఓసారి చెప్పింది ఏ రోజు ఏ COLOR DRESSతో వస్తుందో. ఇంకోసారి ఫోన్ చేస్తే మళ్లీ చెప్పనా అడిగింది(ఈ సోదంతా నాకెందుకు లే అని ఊరుకున్నా). మనం గుర్తుపెట్టుకోలేనంత LAZY కదా. అందుకే ఇప్పుడు రాయటానికి అవేం గుర్తొస్తలేవు. కొన్ని గుర్తున్నాయి.
గురువారం-WHITE....

 శనివారం-BLACK....

 మంగళవారం-PINK... 

శుక్రవారం-BABY PINK

హవ్వా... PINK అంటే నా దృష్టిలో ఒకటే పింక్... కానీ BABY PINK... LAVENDER PINK....ORCHID PINK... LIGHT PINK ఇంకా ఏవేవో చెప్పింది. అమ్మో నా KNOWLEDGEలో 

Red Blue Green-RBG BASIC COLORS అని తెలుసు. ఇలాంటి వింతలు అమ్మాయిల దగ్గరే వినాలి. తను మొదట కనిపించిన PINK DRESSలో ఇంకోసారి కనిపిస్తే బాగుండు...

Sunday 7 August 2016

NEWS PAPER చదివి వినిపించేంత.......

మా మధ్య మాటలు మెల్లి మెల్లిగా నిమిషాలు దాటి గంటలకు చేరాయి.... GENERAL TOPICS నుంచి PERSONAL ISSUES దాకా వెళ్లాయి. ఎన్ని కష్టాలు కన్నీళ్లు ఉన్నా.... తనకు SYMPATHY అస్సలు ఇష్టముండదు. జీవితంలో ధైర్యంగా ముందుకెళ్లటమే తెలుసు. ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నవ్ FUTUREలో అంటే "డబ్బులు వెనకేసి ఓ PROCLAINER కొందామనుకుంటున్నా" అని చెప్పింది.(వామ్మో ఇంత పెద్ద PLAN ఉందా?). ఓ రోజైతే పొద్దునే ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడి న్యూస్ పేపర్ చదవటం మొదలుపెట్టింది. తను ఎంత CASUALగా మాట్లాడుతుందో అంతే కోపంగానూ, స్పష్టంగా, సూటిగానూ చెప్పగలదు.

Friday 5 August 2016

ఇలాంటి GIFT ప్రపంచంలో ఎవరూ ఇచ్చుండరు.....

TRAINING TOURలో.... ఓ దుకాణంల HAND MADE TEDDY BEARతీసుకున్నా. అదే చివరి PIECE. బస్సులో వస్తున్నప్పుడు నా దగ్గర్నుంచి బొమ్మ తీసుకున్న తను దాన్నెంత శ్రద్దగా పట్టుకుందో చూస్తే ఆ బొమ్మంటే తనకెంత ఇష్టమో అర్థమైతది. అది HAND MADE అవటం వల్ల ఆ బొమ్మకున్న  WHITE LAYER తన BLACK DRESSకి అంటుకుంది. బస్సు దిగిన తర్వాత... ఈ బొమ్మ నాకిచ్చేస్తావా అని అడిగింది. (అమ్మాయిలకు GIFTలు ఇవ్వటం వాళ్ల దగ్గర్నుంచి GIFTలు తీసుకోవటం ఇదంతా TRASH అని నా అభిప్రాయం). మొహమాటం లేకుండా చెప్పిన కుదరదు అని. ఆ బొమ్మను నాకిస్తున్నప్పుడు చూడాలి ఆ కళ్లను మరీ చిన్నపిల్లలాగా అయిపోయింది. నేనేం పట్టించుకోకుండానే బొమ్మను తీసేసుకున్నా. ఆ తర్వాత కొన్ని రోజులకు తన B'DAY వచ్చింది. సుమారు 620 కిలోమీటర్ల దూరంలో ఉన్న తనకు 300 RS... COURIER CHARGES పెట్టి 50 రూపాయలకు కొన్న HAND MADE TEDDY BAREని పంపించిన... ఎంత సిల్లిగా ఉందో... తల్చుకుంటే నవ్వొస్తుంది.....

Thursday 4 August 2016

నేనే అడుగుదామనుకున్నా.... తనే అడిగి పెద్ద చాక్లెట్ ఇచ్చింది...

జూలైలో తను వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. JOURNEY కోసం ఏదో వస్తువులు కొనేందుకు వెళ్తూ కనిపించింది. నన్ను రమ్మంది. నాకు పనుందని చెప్పా... ( పని లేదు ఏం లేదు ఇంకోసారి పిలిస్తే పోదామని అలా చెప్పిన అంతే). "నువ్వొస్తే బాగుంటుందని అడిగా. పనుందన్నావ్ కదా సరే"అంది. పనంటే పెద్ద పనేం కాదు పర్లేదు వస్తా పదా అని వెళ్లా. అన్ని కొనేసిన తర్వాత నంబర్ అడుగుదామా లేదా... అడిగితే ఏమైనా అనుకుంటే ఎట్లా.. అన్న డైలామాలో ఉన్న నా వైపు చూస్తు... నీ నంబర్ చెప్పు అంది . ఇంతకంటే సంబురం ఏమన్నా ఉంటదా??? నెంబర్ చెప్పిన. వెళ్తు వెళ్తూ నాకోక పెద్ద CADBURY చాక్లెట్ ఇచ్చింది. ( ఇప్పటికి ఆ  WRAPPER నా దగ్గరే ఉంది. అసలు సినిమాల్లో ఇలాంటివి దాచిపెట్టుకుంటారా అంటే అబ్బే వీళ్లేం మనుషుల్రా బాబు అనుకునే నేనే ఇప్పటికి దాచుకున్నా).

Wednesday 3 August 2016

తను నన్ను ఆలా పిలుస్తుందని అనుకోలేదు....

ఆ రోజు ఎప్పటిలాగే TRAINING CLASSES START అయినయ్.... TEA BREAK TIME లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే.... తమ్ముడు మీది మా ఊరి దగ్గరేనంటా కదా అని పిల్చింది.  అప్పుడు అనిపించింది ఈ వెధవ జీవితం ఎందుకిలా మారిందని... గుండెల్లో ఎక్కడో మంట... మనసులో తుఫాను... అంతా గందరగోళం.... ఎం చెయ్యాలి ఇప్పుడేం చెయ్యాలి... చెప్పాల్సిందే ఇక... నా కంటే 12 నెలల 12 రోజులు పెద్దదైనంతా మాత్రానా నా ఫీలింగ్స్ ని పట్టించుకోకుండా తమ్ముడూ అంటుందా... వెంటనే అనేశా... నన్ను తమ్ముడు అని పిలవొద్దని నాకలాంటి FEELINGS ఏం లేవని... ఇంకా అక్కడే ఉంటే ఇంకేదైనా అనేస్తుందేమోనని జల్దీ బయటపడ్డా...
---------------------------------------------------------------------------------
NOTE: RAJA RANI MOVIE గుర్తొస్తే నా తప్పు లేదు ఎందుకంటే ఇది జరిగింది జూన్ 10 2012.. ఆ సినిమా రిలీజైంది సెప్టెంబర్ 27, 2013


Tuesday 2 August 2016

జడలు మాట్లాడుతాయని తెలిసిన రోజది...

యథాలాపంగా నడుచుకుంటు వెళ్తున్న నాకు ఒక అమ్మాయి జడ అందంగా కనిపించింది. అసలే మే చివరి వారం...... ఎండలో  అలసిపోయి నడుస్తున్న నాకు ఆ జడ కనిపించగానే మంచులో నడుస్తున్నట్టు.... ఏసీలో నిద్రపోతున్నంత చల్లగా వాతావరణం మారిందేమో అనిపించింది. PINK COLOR DRESSలో( అందుకే ఈ బ్లాగంతా పింక్ తో నింపేసింది) ఉన్న ఆ అమ్మాయి వెనకాలే నడిచిన నేను మరో నాలుగేళ్లు తన ఆలోచనలతోనే గడపాల్సి వస్తుందని తెలిసుంటే అసలు ఆ జడని.... అమ్మాయిని కన్నెత్తి కూడా చూసుండకపోయేవాణ్ని. ఆ తర్వాతే తెలిసింది తనూ నాతో పాటే ట్రైనింగ్ లో జాయినైందని . ఓ సంవత్సరం పాటు రోజూ చూస్తుండొచ్చని. ఇక CLASSలో ఆ అమ్మాయి ఎక్కడ కూర్చున్నా సరే నాకు కనిపించేలాగా బెంచీ వెతుక్కొని అవసరమైతే వేరే వాళ్లని లేపి మరీ అక్కడే కూర్చునే వాణ్ని. అమ్మాయిది మా ఊరి దగ్గరేనని తెలిసిన నాకు... మరో విషయమూ తెలిసింది నాకంటే సరిగ్గా 12 నెలల 12 రోజులు పెద్దదని(నేను ఇవన్ని పట్టించుకుంటానా సమస్యే లేదు). నేనొకసారి మాట్లాడించేందుకు ప్రయత్నిస్తే తనూ నన్నేమని పిల్చిందో తెలుసా......తర్వాతి పోస్టులో

Monday 1 August 2016

27కు చేరుకున్న నీకు హ్యాపీ బర్త్ డే........ నీకిద్దామనుకున్న ప్రోక్లెయిన్ గిఫ్ట్ గా......... కుదర్లేదు ప్చ్!!!!!


మరోసారి నీ బర్త్ డే గడిచిపోయింది. ఎప్పటిలాగే అందరికంటే చివరిగా నేనే విష్ చేసిన. ఎందుకో తెలుసా LOOSERS ఎప్పుడూ చివర్లోనే ఉంటరు. అయినా నీకు అర్థరాత్రి WISHES చెప్పిన వాళ్లను గుర్తుంచుకుంటావో లేదో కానీ నేను మాత్రం కచ్చితంగా గుర్తుంటా... అసలు నీ గురించి ఆలోచించొద్దని లక్షసార్లు ఆలోచించి కనీసం ఒక్క నిమిషం కూడా ఆలోచన లేకుండా గడపలేకపోయా.... ఇక నిన్నేం మర్చిపోతా... నిన్ను మర్చిపోవటానికి రెండే రెండు దార్లు.. ఒకటి ఎవరి దారి వాళ్లు వెతుక్కోవటం.... రెండు ఇద్దరి దారి ఒక్కటే కావటం.... ఎప్పుడూ అంటుంటవ్ కదా ఎవర్నుంచి ఏదీ EXPECT చెయ్యకపోతే చాలా ఆనందంగా ఉంటారని నిజమే అనుకుంటా.... అసలు నీ బర్త్ డేకి రెండు గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్న

 1. ప్రొక్లెయిన్(నా వల్ల కాదని ఊరుకున్నా)(click here)

2. వోడ్కా(నీ వల్ల కాదని ఆగిపోయా)

2015 బర్త్ డే నాటి పోస్టు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


Sunday 14 February 2016

నేను నిన్ను ప్రేమించట్లేదు... కానీ

ప్రేమ మీద నా అభిప్రాయాలు వేరు.. అసలు ప్రేమంటే నా దగ్గరున్న Definition వేరు... ఒకమ్మాయిని మనస్పూర్తిగా ఇష్టపడటం ఆతర్వాత పెళ్లి చేసుకోవటం... ఆ తర్వాత జీవితాంతం ప్రేమించటం... ముందే మొత్తం ప్రేమను ఇచ్చేస్తే ఆ తర్వాత మిగిలేది కలహాలే అని నా అభిప్రాయం... ప్రస్తుతానికి నా దగ్గరున్నవి ఈ రెండే Optionలు.... ఈ విషయం నీకు స్పష్టంగా ఓ రోజు చెప్పిన గుర్తుందా మిసిమి... నీకు నా ప్రపోజల్ చెప్పిన తర్వాత నీ దగ్గర్నుంచి వచ్చిన Reply ఏంటో గుర్తుంది కానీ దానర్థమేంటో ఇంకా అన్వేషిస్తూనే ఉన్నా.... నిన్ను ఇష్టపడటానికి రెండే రెండు కారణాలు ఒకటి మా అమ్మాలా ఉంటావ్(ఇది మాత్రం సినిమా డైలాగ్ కాదు... నువ్వు మా అమ్మను చూస్తే ఒప్పుకుంటావ్)... రెండోది ఈ బ్లాగు మొదటి నుంచి చదివితే నీకే అర్థమవుతుంది మిసిమి... ఈ పోస్టు valentine day రోజు రాయటం కేవలం కాకతాళీయమే... ఒక్క రోజు ప్రేమను వ్యక్తపరిచే "దినాల" మీద నాకు నమ్మకం లేదు...

Monday 4 January 2016

నీకు చెప్పే ముందు... నువ్వు చెప్పిన తర్వాత

న్యూ ఇయర్ రాత్రి బ్లాగు గురించి నీు చెప్తామని పొద్దున్నుంచి రాత్రి వరకు ఆలోచించి చివరికి...  నేనొక బ్లాగు రాస్తున్నా అని నీకు చెప్పిన తర్వాత నీ నుంచి రిప్లై లేకపోయేసరికి నా పరిస్థితి "గాజు సీసాలో బిరడా బిగించిన" సైన్స్ ప్రయోగంలా మారింది.. అప్పుడప్పుడూ ఊపిరి ఆడుతున్నట్లు అనిపించింది.... ఇందులో ఉన్న పోస్టులు చదివాక ఇది నీ గురించేనని నీకు కచ్చితంగా అర్థమవుతుంది. మొత్తం చదివి గంట తర్వాత రిప్లై ఇస్తూ బాగుందన్నావు.... ఇక అప్పుడైతే మొత్తం ప్రపంచంలోని ఆక్సిజన్ ని అంతా నేనే పీలుస్తున్నామోనన్న ఫీలింగ్ కలిగింది,,,, నువ్వెప్పుడూ ఇంతే అర్థమై అర్థం కానీ మ్యాథమాటిక్స్ లా ఉంటావు.. ఫార్ములా తెలిస్తే చాలని నేననుకుంటా... కానీ సోల్యూషన్ కోసం జుట్టు పీక్కునేలా చాలా సహజంగా పొదుపుగా మాట్లాడి నా ఉత్సాహాన్ని లాగేసుకుంటావ్.. ఏదైతేేనేం నీకైతే చెప్పేసా అప్పుడప్పుడైనా చదువుతుంటావనుకుంటా... ఇంతలా ఆలోచించి నీకు చెప్పిన రెండో విషయమిది.. మొదటిది... డిసెంబర్ 20 2012లో నీతో అంత దగ్గరగా ఉంటూ మాట్లాడిన చివరి రోజు.... దాని గురించి మరో పోస్టులో చెప్తాను మిసిమి

Friday 1 January 2016

Happy New Year మిసిమి

నాకైతే ఇంకా 2012 గుర్తుంది... అప్పుడే మూడేళ్లు గడిచిపోయాయి.. మరో ముఫ్పై ఏళ్లు కూడా గడిచిపోతాయి...కానీ  మిసిమి ఈ పేరు మాత్రం కాలానికి వయసుకు అతీతంగా నా దగ్గరే ఉంటుంది. రూపాలు మారొచ్చు... భావాలు మాత్రం ఎప్పటికి మారవు...

Thursday 3 September 2015

ఇష్టం అంటే ఇదేనా....

అసలు మిసిమిని ఇష్టపడుతుంటే తనకు సంబంధించిన ప్రతి విషయం ఎంతో అందంగా కనిపిస్తోంది.... జడ నుంచి జాలువారే తన మాటల వరకు... కన్నుల నుంచి తన కోపం వరకు.. కోపం అందంగా కనిపించడమేంటి నా పిచ్చి కాకపోతే...  చాలా రోజుల తర్వాత నీతో అంతసేపు మాట్లాడింది నేనేనా.... నాతో మాట్లాడింది నువ్వేనా....
(ఇంకా ఉంది)

Saturday 1 August 2015

హ్యాపీ బర్త్ డే మిసిమి...

మిసిమి .. ఈరోజుకు నీ వయసు రెండు పదులు దాటి ఆరేళ్లు అవుతుంది.. సరిగ్గా నాకంటే 12నెలల 12 రోజులు పెద్దదానివైన నిన్ను చూసే అవకాశం ప్రస్తుతం నాకుందని అనుకోవట్లేదు. నా జీవితమేదో నేను బతకాలనుకుంటున్న సమయంలో కనిపించి... నా జీవిత గమ్యాన్నే మార్చినవ్... నిన్ను పొందటం నా లక్ష్యం అనుకున్న పరిస్థితుల్లోంచి నా లక్ష్యాన్ని నాకు పరిచయం చేయించినవ్... 2012 మేలో పరిచయమైనప్పుడు నేనున్న స్థానమే చాలనుకొని... సర్దుకుపోయిన నాతో నువ్వు మాట్లాడిన ప్రతిసారి నా గమ్యాన్ని గుర్తు చేయటానికి ప్రయత్నించి ప్రయత్నించి .. మూడేళ్ల తర్వాత నీ నుంచి దూరమైనా సరే... భారమైనా సరే... నీ మాటల ఆంతర్యం తెలిసి పయనం ఆరంభించాను మిసిమి

Thursday 30 July 2015

23 ఏళ్ల తర్వాత తెలిసిన Mathematics...


మిసిమి...  త్రిభుజాల్లాంటి కళ్లలోని తీక్షణత, తన వెంటే నడిచే ఏటవాలు జడ, ఇన్ఫినిటీ లాంటి మాట తీరు (మాట్లాడాలనుకుంటే గల గలా మాట్లాడేస్తుంది), దిశ లేని కోపం (కోపాన్ని ఎటు నుంచి ఎటైనా మళ్లిస్తుంది, వెంటనే మన్నించేస్తుంది), సరళ రేఖ లాంటి వ్యక్తిత్వం(Straight forward)... ఇవన్ని నాకు 2012 మే 28.. అంటే 23 ఏళ్ల తర్వాత నాకు Mathematics ఇంతలా తెలిసాయంటే... నువ్వే కారణం మిసిమి

Wednesday 29 July 2015

మిసిమి... మిసిమిత... The new...

మిసిమి ... అందమైన పేరు అందమైన కళ్ళు ...అందమైన జడ ... గడసారి మాటలు.. ఘాటైన కోపం అంతేనా చెప్పాల్సింది చాల ఉంది రాయాల్సింది మిగిలే ఉంది wait for updates....మిసిమి 

Tuesday 28 July 2015

మిసిమి అసలు ఈ బ్లాగు ఎందుకు???

అసలు మిసిమి  బ్లాగు ఎందుకో నాకే క్లారిటీ లేదు.. కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.. ఇందులో ఏం రాయాలో ఎవరెవరి గురించి రాయాలో ఆలోచించేశా.